మహిళా భవన స్థలంపై పంచాయతీలో చిచ్చు!

సర్పంచ్‌,ఒక్క వార్డు సభ్యురాలు ఓ వైపు.. ఉపసర్పంచ్‌, ముగ్గురు సభ్యులు మరోవైపు కోనాపూర్‌లో తీర్మానం అమలుపై వివాదం

మహిళా భవన స్థలంపై పంచాయతీలో చిచ్చు!

దౌల్తాబాద్‌,సిద్దిపేట: కోనాపూర్‌ గ్రామ పంచాయతీలో మహిళా భవన నిర్మాణ స్థలం పాలకవర్గంలో విభేదాలకు కారణమైంది. అంబేద్కర్‌ విగ్రహం వద్దే నిర్మాణం చేపట్టాలని సర్పంచ్‌ పట్టుబడుతుండగా, పంచాయతీ కార్యాలయం వెనుక ఖాళీ స్థలంలో నిర్మించాలని ఉపసర్పంచ్‌తో పాటు ముగ్గురు వార్డు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. సమావేశంలో మెజారిటీ సభ్యులు సూచించిన స్థలాన్ని కాదని తిరిగి పాత స్థలంలో పనులు చేపట్టడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబరు 7న నిర్వహించిన పాలకవర్గ సమావేశానికి సర్పంచ్‌, ఉపసర్పంచ్‌తో పాటు నలుగురు వార్డు సభ్యులు హాజరయ్యారు. అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిర్మాణం చేపట్టాలని సర్పంచ్‌, ఒక వార్డు సభ్యురాలు పేర్కొనగా.. పంచాయతీ కార్యాలయం వెనుక ఖాళీ స్థలాన్ని ఉపసర్పంచ్‌తో పాటు ముగ్గురు సభ్యులు ప్రతిపాదించారు. ఈ అభిప్రాయభేదాల మధ్య స్థల ఎంపికపై వివాదం కొనసాగుతోంది.గతంలో పంచాయతీ తీర్మానం లేకుండానే పనులు ప్రారంభించడంపై గ్రామానికి చెందిన గణేష్‌ పంచమి ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థలాన్ని పరిశీలించిన ఎంపీడీవో, పంచాయతీ తీర్మానం చేసిన తర్వాతే పనులు చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం. అయినప్పటికీ అంబేద్కర్‌ విగ్రహం వద్దే పనులు తిరిగి ప్రారంభించడంతో పాలకవర్గ సభ్యుల అభ్యంతరాలు మరింత తీవ్రమయ్యాయి.తీర్మానం అమలయ్యేనా?పాలకవర్గ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలకు, నిర్మాణ పనులు జరుగుతున్న తీరుకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోందని సభ్యులు పేర్కొంటున్నారు. సమష్టి నిర్ణయానికి ప్రాధాన్యమివ్వాలని, స్థల ఎంపికపై నెలకొన్న వివాదాన్ని అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై సర్పంచ్‌ వివరణ, పంచాయతీ తీర్మానం పూర్తి వివరాలు, అధికారుల తదుపరి చర్యలు తెలియాల్సి ఉంది.

Views: 218

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!