ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు దాడి...

WhatsApp Image 2026-03-01 at 5.23.41 PM

 

బోధన్  : బోధన్ మండలం కండ్గావ్ గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకున్నందుకు తనమీద కిరణ్ అనే వ్యక్తి దాడి చేశారని గ్రామానికి చెందిన శుభం పాటిల్ బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిన సమయంలో టిఎస్ఎండిసి, రూరల్ పోలీసులు ఉన్నట్లు తెలిపారు. తాను గ్రామ సర్పంచ్ కుమారున్ని అని చెప్పిన వినకుండా మీ అమ్మ వచ్చి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలి నువ్వెలా అడ్డుకుంటావని దాడి చేశారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Views: 23

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News