అన్ని మతాలు సమానమే ... మాజీ మేయర్ సంజయ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ

నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో అన్ని మతాలు సమానమే అంటూ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం శాంతి ర్యాలీ జరిగింది. హిందువులు, ముస్లీంలు, క్రైస్తవులు, సిక్కులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని మనమంత ఒక్కటే అంటూ ముందుకుసాగారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ సమాజంలో విద్వేషాలకు చోటులేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే ఈ ర్యాలీ ఉద్దేశ్యమన్నారు. దివంగత డి శ్రీనివాస్ కడుపున పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ డీఎస్ వారసులేనని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తాను నగర మేయర్గా విజయవంతంగా పనిచేయటం ఎంతో గర్వంగా ఉందన్నారు. తన తండ్రి డీఎస్ హయంలో, తన హయంలో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ ప్రజల మధ్య శాంతిని కాపాడేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ఆకుల చిన్న రాజేశ్వర్. బంటు బలరాం, వివిధ మతాలకు చెందినవారు, యువకులు, డీఎస్ అభిమానులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


