క్రమశిక్షణ విద్యతోనే పేదరికాన్ని జయించొచ్చు

క్రమశిక్షణ విద్యతోనే పేదరికాన్ని జయించొచ్చు

  • -ప్రముఖ సినీ నిర్మాత, సామాజికవేత్త, లయన్ బి శ్రీనివాస్ రెడ్డి
  • -ప్రముఖ సామాజికవేత్త లయన్ కవిత హీరానందాని స్పష్టీకరణ
  • -నాగోల్ సాయినగర్ గుడిసెలోని నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ 

ఎల్బీనగర్  : నేటి పోటీ ప్రపంచంలో విద్యను మించిన సంపద లేదని, నేటి యువతరం స్వశక్తితో పాటు భారతీయ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయికి చాటి చెప్పడానికి విద్య ఎంతో సులభమైన మార్గమని ప్రముఖ సినీ నిర్మాత, సామాజికవేత్త, లయన్ బి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ సాయినగర్ గుడిసెల్లో నివాసం ఉంటున్నటువంటి నిరుపేద విద్యార్థులకు ప్రముఖ సామాజికవేత్త లయన్ కవిత హీరానందాని, ప్రముఖ సినీ రచయిత బి వెంకటరమణతో కలిసి విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చదువుకు పేదరికం అడ్డురాదని, క్రమశిక్షణ గల విద్యను నేర్చుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అవరోధించాలని వారు ఆకాంక్షించారు. పాఠశాల విద్య ఎంతో కీలకమని, విద్యతోపాటు విద్యార్థులకు అనుకోగా ఉన్నటువంటి క్రీడారంగంలో కూడా విద్యార్థులు రాణించాల ని వారు విద్యార్థులకు సూచించారు. పేద విద్యార్థులను ఆదుకోవడానికి అనేక సేవా కార్యక్రమా లను నిర్వహించడానికి తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 జగన్ మోహన్ రావు కి రాఖీలు కట్టిన 47వ డివిజన్ ఆడబిడ్డలు  జగన్ మోహన్ రావు కి రాఖీలు కట్టిన 47వ డివిజన్ ఆడబిడ్డలు
మంచిర్యాల టౌన్ రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కు చెందిన ఆడబిడ్డలు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...
సందడిగా మారిన మంచిర్యాల మార్కెట్
రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన రఘునాథ్ వెరబెల్లి
బోధన్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దురదృష్టకరం 
తెలంగాణ రాష్ట్ర ఓరుగల్లు దళిత చైతన్య సభ వాయిదా
అనుబంధానికి ప్రతిక... రాఖీ వేడుక: ఎమ్మెల్యే కె ఆర్  నాగరాజు 
కాజీపేటలో అదనపు రైలు హాల్టులు,