వెంగళరావు పేట ఎస్సీ సెల్ గ్రామ కమిటీ ఎన్నిక
వెంకటాపురం: ములుగు జిల్లా ,వెంకటాపురం మండల పరిధిలోని వెంగళరావు పేట ఎస్సీ సెల్ గ్రామ కమిటీ ఎన్నికను గురువారం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిట్యాల సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.వెంగళరావు పేట గ్రామ అధ్యక్షుడు గా చంద్రగిరి సాగర్, ఉపాధ్యక్షుడు శెట్టి పల్లి రవిబాబు, కార్యదర్శి శెట్టి పల్లి కోటి, వేల్పుల మానస,అడ్దూరి సహజ తో పాటు 26 మంది సభ్యులతో గ్రామ కమిటీ కి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చిట్యాల సాగర్ మాట్లాడుతూ. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ , టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ఎల్. వెంకట నరసయ్య , ములుగు జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మట్టేవాడ తిరుపతి , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్ ఆదేశాల మేరకు మండలం లో ఎస్సీ సెల్ గ్రామ కమిటీలు నియామకం జరుగుతుంది అని తెలిపారు.నూతనంగా ఎన్నికైన వెంగళరావు పేట ఎస్సీ సెల్ గ్రామ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చిట్యాల సాగర్ పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో వెంకటాపురం మండల ఎస్సీ సెల్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రగిరి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేల్పుల రామ్ కుమార్, శెట్టిపళ్లి రమేష్, పంచాయితీ కో ఆప్షన్ లీడర్ చిట్యాల త్రివేణి, వేల్పుల మానస వేల్పుల కళావతి,వేల్పుల సౌందర్య తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


