భూపాలపల్లి ఏరియాలో స్పెషల్ క్యాంపెయిన్ 6.0పై సమీక్ష సమావేశం
భూపాలపల్లి టౌన్ : సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ క్యాంపెయిన్ 6.0పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, స్పెషల్ క్యాంపెయిన్ 6.0లో భాగంగా కార్యాలయాలు, పని ప్రదేశాల్లో పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు, ఈ-వేస్ట్‌ను సమర్థవంతంగా వేరు చేసి, సక్రమంగా పారవేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ క్యాంపెయిన్ మూడు దశల్లో నిర్వహించబడుతుందని, సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు ప్రిపరేటరీ ఫేజ్, అక్టోబర్ 2 నుంచి 31 వరకు ఇంప్లిమెంటేషన్ ఫేజ్, నవంబర్ 17 నుంచి 30 వరకు ఎవాల్యుయేషన్ ఫేజ్ కొనసాగుతాయని తెలిపారు. గత యేడాది 5.0 లో 52 ప్రదేశాలలో 114250 స్క్వేర్ ఫీట్ ఇంప్లిమెంటేషన్ చేయగా కంపనీ వ్యాప్తంగ తృతీయ బహుమతి గెలుసుకున్నామని ఈ ఏడాది 336438 స్క్వేర్ ఫీట్ ఇంప్లిమెంటేషన్ చేసి మొదటి బహుమతి గెలుచుకోవాలని జిఎం అధికారులకు దిశ నిర్ధేశమ్ చేశారు . అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి స్పెషల్ క్యాంపెయిన్ 6.0ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సేవ ఎస్. ఓ. టు జి. ఎం రామన్ వి పాఠక్, ఏజీఎం (సివిల్ ) రవికుమార్, ఏజీఎం (ఐ ఈ డీ ) జోతి , ఓసి-2 పిఓ శ్యామ్ సుందర్, ఓసి-3 రామస్వామి ఏరియా కేటీకే-1 గ్రూప్ ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్ సుందర్ , ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ టి. పోషమల్లు అన్నీ గనుల ,డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


