పుల్కల్‌లో రూ.18 లక్షలతో సీసీ డ్రైనేజీ పనులకు శ్రీకారం

పుల్కల్‌లో రూ.18 లక్షలతో సీసీ డ్రైనేజీ పనులకు శ్రీకారం

చౌటకూర్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ లావణ్య–కృష్ణారెడ్డి మంగళవారం టెంకాయ కొట్టి ప్రారంభించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూఈ పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య–కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశీస్సులు, సహకారంతో గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామంలోని అన్ని వీధుల్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. సుమారు రూ.18 లక్షల వ్యయంతో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నామని, పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ సహాయ ఇంజనీర్ (ఏఈ), గ్రామ కార్యదర్శి ప్రవీణ్, ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యులు చింత నరేందర్, మంగలి రాజు, కనిగిరి మల్లేశం, మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ చారి, మాజీ సర్పంచ్ మఠం సిద్ధయ్య, మల్లారెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి పనులు వేగవంతం కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 
Views: 84

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ