భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - మున్సిపల్ చైర్‌పర్సన్ 

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - మున్సిపల్ చైర్‌పర్సన్ 

గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లలో నివాసం ఉండకూడదని, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు మరియు విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే రోడ్లపై ప్రయాణించే సమయంలో యూజీడీ మ్యాన్‌హోల్స్‌ను గుర్తిస్తూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అదేవిధంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య వాహనాలకు మాత్రమే అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే పరిశుభ్రమైన, సురక్షితమైన గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌ను నిర్మించగలమని పేర్కొన్నారు.
Views: 51

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News