విద్యా హబ్ గా స్టేషన్ ఘన్‌పూర్

ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించడమే కాంగ్రెస్ లక్ష్యం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

విద్యా హబ్ గా  స్టేషన్ ఘన్‌పూర్

స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ): స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యా హబ్ గా తీర్చిదిద్దుతానని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి ఐదు ఎకరాల భూమి కేటాయించినందుకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తూ సంబంధిత అలాట్ మెంట్ కాపీని శుక్రవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న డిగ్రీ కళాశాల నిర్మాణానికి మార్గం సుగమం అయిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి లక్ష్మణ్ కు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ ఋణపడి ఉంటారని తెలిపారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో గురుకులాలు, కస్తూరిభా గాంధీ పాఠశాలలు, మాడల్ స్కూళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, తెలంగాణ పబ్లిక్ స్కూల్తో పాటు డిగ్రీ కళాశాల కూడా అతి త్వరలోనే స్వంత భవనంలో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు రానున్న రోజులల్లో నియోజకవర్గాన్ని విద్యా హబ్ తీర్చిదిద్దుతానని కడియం తెలిపారు. 
Views: 143

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి