రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసమే గువ్వల బాలరాజ్ ఆరోపణలు

WhatsApp Image 2026-03-01 at 5.26.01 PM

 

అచ్చంపేట :  రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసమే మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకుడు గువ్వల బాలరాజ్ కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేశాడని బల్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాల్ రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు శనివారం మండల కేంద్రమైన బల్మూర్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో గువ్వల బాలరాజు పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వంశీకృష్ణ కాంగ్రెస్ నాయకులను అసభ్యకరంగా   మాట్లాడడం జరిగిందని విమర్శించారు ఇటీవల బల్మూరులో జరిగిన సంఘటన సంబంధించి వాస్తవాలు తీసుకోకుండా ఆయన లేనిపోని అసభ్యకర మాటలు మాట్లాడడం సమంజసం కాదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్ డిసిసి జిల్లా కార్యదర్శి కాశన్న యాదవ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిరంజన్ గౌడ్ ఉప సర్పంచ్ రాజురావు ఉపాధ్యక్షులు మషన్న ప్రధాన కార్యదర్శి రమేష్ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు కొండారెడ్డిపల్లి సర్పంచ్ పంప రాధాకృష్ణ పోలిశెట్టిపల్లి సర్పంచ్ ఎల్ల స్వామి మహదేవపూర్ సర్పంచ్ సైదులు గ్రామ అధ్యక్షులు జంగయ్య యాదగిరి రావు అనిల్ గౌడ్ శేఖర్ లింగం తదితరులు పాల్గొన్నారు

Views: 96

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News