పాపన్నపేటలో ఘనంగా 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
పాపన్నపేట : జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రమైన పాపన్నపేట చేనేత సహకార సంఘంలో శుక్రవారం నాడు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమానికి మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాకల జయరాములు,మెదక్ పద్మశాలి సంఘం అధ్యక్షులు బోద్దుల సంతోష్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా చేనేత జాతి పిత కొండా లక్ష్మణ్ బాపూజీ,మార్కండేయ మహరాజ్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నికైన అధ్యక్ష,కార్యదర్శులను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాపన్నపేట పద్మశాలి సహకార సంఘం అధ్యక్షులు కొడపాక విట్టల్,మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు వళ్ళందేశి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పల్లె సంగమేశ్వర్,డైరెక్టర్ లు పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Aug 2026 18:17:29
చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న...
