చంద్రగ్రహణం సందర్భంగా 3 తేదీన ఉమామహేశ్వర దేవస్థానం మూసివేత

అచ్చంపేట : శ్రీశైలం ఉత్తర ద్వారంగా బాసిల్లుతున్న శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం చంద్రగ్రహణం సందర్భంగా మూడవ తేదీ మంగళవారం ఆలయం మూసివేయడం జరుగుతుందని చైర్మన్ మాధవరెడ్డి ఈవో శ్రీనివాసరావు తెలిపారు మంగళవారం ఉదయం 6 గంటలకు స్వామివారి పూజ కార్యక్రమాలు అనంతరం ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా అభిషేకాలు అర్చనలు ఆర్థిక సేవలు జరగవని ఉప ఆలయాలు కూడా ముసి వేయబడతాయని తెలిపారు నిత్య అన్నదాన సత్రం కూడా శుభోదయం అన్నారు భక్తులు గమనించాలని తెలిపారు తిరిగి ఆలయమును నాలుగో తేదీ రోజు బుధవారం ఉదయం 6 గంటలకు తెరచి శుద్ధిచేసి సంప్రోక్షణ అభిషేకం తదుపరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు నాలుగో తేదీన 12 గంటల నుంచి ఎద విధిగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


