ఏటిగడ్డ నరసింహా రెడ్డి – రెడ్డి కన్వెన్షన్ నూతనభవనం ప్రారంభించిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

నగర్ కర్నూల్ : నూతనంగా ఏర్పాటు చేసిన రెడ్డి కన్వెన్షన్ భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి , మాట్లాడుతూ, కన్వెన్షన్ హాల్ అభివృద్ధికి అవసరమైన జనరేటర్, రహదారుల ఏర్పాటుతో పాటు అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అలాగే పేద మరియు ప్రతిభావంతులైనవిద్యార్థులకు రెడ్డి సేవా సమితి ద్వారా నాణ్యమైన విద్య, ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు రావాలని ఆకాంక్షించారు.కన్వెన్షన్‌కు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూసిద్ధంగాఉంటానని, అవసరమైన ప్రతి పని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సమితిసభ్యులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


