బోడం పహడ్ గ్రామంలో ఘనంగా 'జలసిరి' కార్యక్రమం

బోడం పహడ్ గ్రామంలో ఘనంగా 'జలసిరి' కార్యక్రమం

  •  కలిసి కట్టుగా పని చేస్తేనే గ్రామ అభివృద్ధి: గ్రామ సర్పంచ్ కమలమ్మ
  • ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి

 షాబాద్,(రంగారెడ్డి): షాబాద్ మండలం బోడం పహడ్ గ్రామంలో జలసిరి కార్యక్రమాన్ని మంగళ వారం విజయవంతంగా నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం వర్షపు నీటిని పొదుపు చేయడం, భూగర్భ జలమట్టాలను గణనీయంగా పెంచడం లక్ష్యంగా తెలంగాణ జలసిరి’కార్యక్రమాన్ని ప్రారంభించిందని.ప్రతి ఇంటికీ ఒక ఇంకుడు గుంత, ప్రతి పొలానికీ ఒక పంట కుంట (ఫార్మ్ పాండ్), ప్రతి ఊరికీ ఒక ఊట కుంట" అనే నినాదంతో ఈ పథకం ముందుకు సాగుతోంది. భవనాలపై పడే వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతులను ప్రోత్సహిస్తారు.ఎల్‌నినో లేదా కరువు పరిస్థితులను అధిగమించడానికి గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మలచడమే దీని ముఖ్య ఉద్దశం.కేంద్ర ప్రభుత్వం మునుపటి ఉపాధి హామీ చట్టం స్థానంలో వి బి జి ఆర్ ఏ ఏం జి) స్థానంలోఅనే నూతన ఉపాధి హామీ చట్టాన్ని అమలులోకి తెచ్చింది.ఇదివరకు ఉన్న 100 రోజుల ఉపాధి హామీ పనిదినాలను ఈ పథకం ద్వారా 125 రోజులకు పెంచడం జరిగింది.ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు సమకూరుస్తుంది.రైతుల నాట్లు, కోతల పనుల సమయంలో కూలీల కొరత రాకుండా ఉండేందుకు ఏటా 60 రోజుల పాటు వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా 'అగ్రికల్చర్ హాలిడే పీరియడ్' వర్తింపజేస్తారు. వారానికోసారి వేతనాలు అందుతాయి. వేతనం చెల్లింపులో 15 రోజులకు మించి జాప్యం జరిగితే ఆ నష్టపరిహారం (0.5% వడ్డీతో) చెల్లిస్తారు. ఉపాధి చూపని పక్షంలో భత్యం అందజేస్తారు. ఎక్కువ రోజులు పని లభించడం వల్ల గ్రామీణ పేద, నిరుపేద కుటుంబాలకు ఆదాయ భద్రత లభిస్తుంది.గ్రామంలో శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీలు, ఇంకుడు గుంతలు, రోడ్లు, నీటి సంరక్షణ నిర్మాణాలు చేపడతారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.గ్రామ సర్పంచ్ సబ్బరిగారి కమలమ్మ మాట్లాడుతూ... ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించవచ్చని తెలిపారు.సాంకేతిక సహాయకులు శివ మాట్లాడుతూ... పరుగెత్తే నీటిని నడిచేలా, నడిచే నీటిని ఆగేలా, ఆగిన నీటిని ఇంకెలా చేయడం వల్ల  నీటి వృథాను నివారించడంతో పాటు భవిష్యత్ తరాలకు నీటిని అందించగలం అని అన్నారు.వనరులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అందుకోసం నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలని దానికి ప్రభుత్వం 6500 రూపాయలు మంజూరు చేస్తున్నట్లు,అలాగే పంట కుంటలకు కూడా ప్రభుత్వం 12,400 రూపాయలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం,నీటి వనరులను కాపాడడం వంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి స్నేహలత, సి సి లోకేష్,వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
 
 
Views: 32

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News