గ్రామీణ పురోగతికే 'తెలంగాణ జలసిరి', వి బి జిఆర్ఎఏంజి పథకాలు

: కొమరబండ గ్రామ సర్పంచ్ పద్మ గోపాల్

గ్రామీణ పురోగతికే 'తెలంగాణ జలసిరి', వి బి జిఆర్ఎఏంజి పథకాలు

షాబాద్,(రంగారెడ్డి): షాబాద్ మండలం,కొమరబండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ జలసిరి', కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకాలపై మంగళ వారం ప్రత్యేక అవగాహన సమావేశం (గ్రామసభ) నిర్వహించారు.ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ పద్మ గోపాల్ అధ్యక్షత వహించగా, గ్రామ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ పద్మ గోపాల్,సాంకేతిక నిపుణులు మౌనిక మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం వర్షపు నీటిని పొదుపు చేయడం, భూగర్భ జలమట్టాలను గణనీయంగా పెంచడం లక్ష్యంగా తెలంగాణ జలసిరి’కార్యక్రమాన్ని ప్రారంభించిందని.ప్రతి ఇంటికీ ఒక ఇంకుడు గుంత, ప్రతి పొలానికీ ఒక పంట కుంట (ఫార్మ్ పాండ్), ప్రతి ఊరికీ ఒక ఊట కుంట" అనే నినాదంతో ఈ పథకం ముందుకు సాగుతోంది. భవనాలపై పడే వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతులను ప్రోత్సహిస్తారు.ఎల్‌నినో లేదా కరువు పరిస్థితులను అధిగమించడానికి గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మలచడమే దీని ముఖ్య ఉద్దేశం. ఎండిపోతున్న బోర్లు, బావుల్లో మళ్లీ నీటి మట్టాలు పెరుగుతాయి. పంట కుంటల ద్వారా నీటి ఎద్దడి సమయంలో పంటలకు సాగునీరు అందుతుంది.వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడం వల్ల వేసవిలో నీటి ఎద్దడి తప్పుతుంది.కేంద్ర ప్రభుత్వం మునుపటి ఉపాధి హామీ చట్టం స్థానంలో వి బి జి ఆర్ ఏ ఏం జి) స్థానంలోఅనే నూతన ఉపాధి హామీ చట్టాన్ని అమలులోకి తెచ్చింది.ఇదివరకు ఉన్న 100 రోజుల ఉపాధి హామీ పనిదినాలను ఈ పథకం ద్వారా 125 రోజులకు పెంచడం జరిగింది.ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు సమకూరుస్తుంది.రైతుల నాట్లు, కోతల పనుల సమయంలో కూలీల కొరత రాకుండా ఉండేందుకు ఏటా 60 రోజుల పాటు వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా 'అగ్రికల్చర్ హాలిడే పీరియడ్' వర్తింపజేస్తారు. వారానికోసారి వేతనాలు అందుతాయి. వేతనం చెల్లింపులో 15 రోజులకు మించి జాప్యం జరిగితే ఆ నష్టపరిహారం (0.5% వడ్డీతో) చెల్లిస్తారు. ఉపాధి చూపని పక్షంలో భత్యం అందజేస్తారు. ఎక్కువ రోజులు పని లభించడం వల్ల గ్రామీణ పేద, నిరుపేద కుటుంబాలకు ఆదాయ భద్రత లభిస్తుంది.గ్రామంలో శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీలు, ఇంకుడు గుంతలు, రోడ్లు, నీటి సంరక్షణ నిర్మాణాలు చేపడతారు. వ్యవసాయ సీజన్లలో ఉపాధి పనులకు విరామం ఇవ్వడం వల్ల రైతులకు కూలీల కొరత తీరుతుందని అన్నారు.గ్రామ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 'తెలంగాణ జలసిరి,'వి బి జి ఆర్ ఎ ఏం జి పథకాలను కొమరబండ గ్రామ ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని నీటి వృథాను అరికట్టాలి. గ్రామస్తులు, ఉపాధి కూలీలు, మహిళా సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా భాగస్వాములై కొమరబండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అని కోరారు.ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల నాయకులు,గ్రామ రైతులు పాల్గొన్నారు.
 
Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News