నూతన సర్పంచులకు మంత్రులు సన్నానం

-ప్రజా ప్రభుత్వం ప్రతి సమస్య పరిష్కరించేందుకు కృషి -మంత్రులు పోంగులేటి శ్రీనివాసరెడ్డి,సీతక్క

WhatsApp Image 2026-03-01 at 3.17.15 PM

 

వెంకటాపురం : నూతనంగా ఎన్నికైన పంచాయతీ సర్పంచులకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)  ఆదివారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రము లోని కాఫేడ్ ఆవరణలో వెంకటాపురం , వాజేడు మండలాల సర్పంచ్ ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఘనం గా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికైన సర్పంచులకు ఉపసర్పంచ్ లకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.పల్లెల అభివృద్ధి కి బాధ్యత గా కృషి చేయాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామని, ప్రతి పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.రైతల కు రైతు బీమా,సన్నవడ్లకు బోనస్ ఇచ్చాం, రెండు సంవత్సరాల లో నిరుద్యోగులకు 77 వేల ఉద్యోగాలు ఇచ్చాం అని అన్నారు. మండలం లోని ప్రధాన సమస్యలు పాలెం వాగు ప్రాజెక్టు మరమత్తులు, సెంట్రల్ లైటింగ్, ఇందిరమ్మ ఇల్లులు పెంచాలి అని,వెంకటాపురం,చర్ల ఆర్& బి రోడ్డు పరిష్కారం కోసం మంత్రులు దృష్టి కి చిడెం మోహన్ రావు, చిడెంశివ తీసుకొని వెళ్లారు. ఇది ప్రజా ప్రభుత్వం అని పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం అని,అతి త్వరలోనే ప్రధాన సమస్యలను పరిష్కరించుతామని సభ వేదిక గా మంత్రులు హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, మాజీ శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మినారాయణ,చర్ల మార్కేట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీను, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చిడెం మోహన్ రావు, భద్రాచలం నియోజకవర్గ బ్లాక్ అధ్యక్షుడు చిడెం సాంబశివరావు (శివ) ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు మన్యం సునీల్ బాబు, యువజన విభాగం అధ్యక్షుడు సాయి క్రిష్ణ, నాయకులు బాలసాని వేణు గోపాల్, గార్లపాటి రవి, పల్నాటి నాగేశ్వరరావ, రమేష్,డర్రరవి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Views: 406

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News