అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు.
మంజూరు చేసిన ఇండ్లను త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలి మంత్రి దనసరి అనసూయ సీతక్క.

ములుగు : ఆదివారం :ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని ఎస్ ఎల్ ఎన్ గార్డెన్ ఫంక్షన్ లో మంత్రి దనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., తో కలిసి ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను, ఏటూరు నాగారం మండలనికి చెందిన 38 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని పేదవాడి కలను సకారం చేయడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, మంజూరు చేసిన ఇండ్లను లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణం పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు. కొండాయి గ్రామంలో పార్టీలకు అతీతంగా 90 మందికి ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, 16 కోట్ల రూపాయల నిధులతో పటిష్టంగా అత్యంత నాణ్యత ప్రమాణాలతో వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మహిళా సంఘం లో సభ్యురాలుగా ఉంటే ఇంటి నిర్మాణానికి తక్షణమే లక్ష రూపాయల రుణాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. కొండాయి గ్రామం జంపన్న వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నందున మంజూరు అయిన ఇండ్లను సురక్షిత ప్రాంతంలో నిర్మించుకోవాలని లబ్ధిదారులకు మంత్రి సూచించారు. ఏటూరు నాగారం మండలానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ తో కలిసి కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


