నూతనంగా నిర్మాణం చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రా భవనాన్ని ప్రారంభించాలి
రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు
గంభీరావుపేట : గంభీరావుపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని వెంటనే ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలీ అని మండల బిజెపి అధ్యక్షుడు కోడె రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి తెలంగాణ స్థూపం వద్ద శనివారం రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో మారుతి రెడ్డి, మెడికల్ ఆఫీసర్. కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ,
గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతనంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని నిర్మించడం జరిగింది. అయితే భవన నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోకపోవడం పట్ల గంభీరావుపేట మండల ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది అని,ఈ ప్రాంతంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు, వృద్ధులు, గర్బిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ప్రాథమిక వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర వైద్య అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన నూతన ఆసుపత్రి భవనం నిరుపయోగంగా ఉండటం బాధాకరం అని, నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని తక్షణమే ప్రారంభించాలి అని ప్రజలకు 24 గంటల అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కొక్కు దేవేందర్ యాదవ్, దేవసాని కృష్ణ, సత్యనారాయణ గౌడ్, దేవేందర్ యాదవ్, గంట అశోక్, తిరుపతి, శ్రీనివాస్, బండ దేవయ్య, రవి నాయక్, మల్లేశం, సర్వోత్తమ్, తో పాటు పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

