సెయింట్ జోసఫ్ పాఠశాలలో విద్యార్థులకు న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో ఫోక్స చట్టంపై అవగాహన

సెయింట్ జోసఫ్ పాఠశాలలో విద్యార్థులకు న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో ఫోక్స చట్టంపై అవగాహన

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం రోజున మండల న్యాయ సేవల కమిటీ, హుస్నాబాద్ ఆధ్వర్యంలో పోక్సో చట్టం మరియు బాలల భద్రతపై న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అడిషనల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి,ఈ.ప్రమిద మాజీ ఏజీపీ న్యాయవాది కన్నోజు రామకృష్ణ,పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ విజయకుమార్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు  ఉపాధ్యాయులు  విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా  జడ్జి ఈ.ప్రమీద మాట్లాడుతూ పోక్సో చట్టం యొక్క ప్రాముఖ్యతను,ఈ చట్టం కింద నేరాలకు పాల్పడిన వారికి విధించబడే కఠినమైన శిక్షలను వివరించారు.బాలలపై జరిగే లైంగిక వేధింపులు,అనుచిత ప్రవర్తన వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని,అలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులు సొంతవారైనా సరే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మంచి స్పర్శ (గుడ్ టచ్), చెడు స్పర్శ (బ్యాడ్ టచ్) మధ్య తేడాను ప్రతి బాలిక మరియు బాలుడు తెలుసుకోవడం ఎంతో అవసరమని వివరించారు.
పోక్సో చట్టం బాలలను లైంగిక నేరాల నుంచి రక్షించడానికి రూపొందించబడిందని,ఈ చట్టం కింద నేరాలకు పాల్పడిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. బాలలపై ఎలాంటి లైంగిక వేధింపులు లేదా అనుచిత ప్రవర్తన జరిగినా వెంటనే తల్లిదండ్రులకు, నమ్మకమైన కుటుంబ సభ్యులకు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
అలాగే, న్యాయ సేవల సంస్థల ద్వారా అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. బాలల హక్కులను కాపాడటానికి, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి పోక్సో చట్టం ఎంతో ఉపయోగకరమైనదని వివరించారు. ఈ చట్టాన్ని బాలల రక్షణ కోసం సక్రమంగా వినియోగించుకోవాలని, దుర్వినియోగం చేయకూడదని సూచించారు.ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు పోక్సో చట్టం, బాలల భద్రత, మంచి స్పర్శ–చెడు స్పర్శ మధ్య తేడా, లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసే విధానం మరియు ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన కల్పించబడిందని పాఠశాల కరస్పాండెంట్ విజయకుమార్ రెడ్డి తెలిపారు.

Views: 35

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ మండలంలో ఐదు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చౌటకూర్ మండలంలో ఐదు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
చౌటకూర్ :  రైతులకు పండించిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు.సంగారెడ్డి...
ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న కూలీలకు 11కెవి వైర్లు తగిలి నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు
రాణిపేట సెయింట్ మేరీ పాఠశాలలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీ
నాగారంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై కాంగ్రెస్ విస్తృత ప్రచారంe
మారుమూల ఆదివాసీ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
సెయింట్ జోసఫ్ పాఠశాలలో విద్యార్థులకు న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో ఫోక్స చట్టంపై అవగాహన
అర్హులైన జర్నలిస్టులందరికి ఇంటి స్థలం ఇవ్వాలి.!