మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన  ఎమ్మెల్యే అనిల్ జాదవ్,  ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

ఆదిలాబాద్ బ్యూరో : రైతుల సాగునీటికోసం ఎదురుచూపులకు తెరదించుతూ తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు నీటిని విడుదల చేయడం స్థానిక రైతన్నలకు ఎంతో ఊరటనిచ్చే పరిణామమని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి  పేర్కొన్నారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి  నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొని రైతన్నలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా సాగునీటిని రైతులు ప్రతి ఒక్కరూ అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ కష్టమొచ్చినా రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, ఆత్మహత్యల వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. అన్నదాతలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వ పరంగా, పార్టీలకు అతీతంగా నాయకులందరం కలిసికట్టుగా అండగా నిలబడి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి, ప్రతి ఒక్కరికీ తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, వడ్డడి సర్పంచ్ జయసుధ గంగాధర్ , ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ , తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కౌడాల సంతోష్ , ఏఎంసీ మెంబర్ తాటి అశోక్ , అలీమ్ , ఖమ్రుద్దీన్ ల తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన  ఎమ్మెల్యే అనిల్ జాదవ్,  ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి   మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ బ్యూరో  : రైతుల సాగునీటికోసం ఎదురుచూపులకు తెరదించుతూ తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు నీటిని విడుదల చేయడం స్థానిక రైతన్నలకు ఎంతో ఊరటనిచ్చే పరిణామమని...
1న ఆదిలాబాద్ పట్టణంలో జరిగే రైతు గర్జన సభను విజయవంతం చేయాలి - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే జోగు,బాల్కసుమన్
మంత్రులను కలిసిన గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ మరియు పాలక వర్గం
మల్లారం సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ శివంపేటలో ఈ-వేస్ట్‌పై అవగాహన కార్యక్రమం
శివన్నగూడెం పనులను వెంటనే పూర్తి చేయాలి
న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్