తెలంగాణలో జనసేన ప్రత్యామ్నాయం.
జనసేన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాస్
హన్మకొండ: తెలంగాణలో జనసేనపార్టీ ప్రత్యాన్మయంగా మారబోతుందని జనసేనపార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ,మాజీ హెల్త్ డైరెక్టర్,పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాస్ అన్నారు.హన్మకొండలో హరిత కాకతీయ హోటల్ హల్ లో ఏర్పాటు చేసిన జనసేనపార్టీ ముఖ్య నాయకులతో పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో అయన మాట్లాడుతూ సామాజిక న్యాయమే జనసేన లక్ష్యమని తెలిపారు. పట్టభద్రులు, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగ నియామకాలు, యువత భవిష్యత్తుకు సంబంధిం చిన అంశాలను శాసనమండలి వేదికగా బలంగా ప్రస్తావిస్తామని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, హక్కులు అందేలా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.జనసేన తెలం గాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. మచ్చ సుధాకర్, శ్రీధర శర్మ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ మాదిరెడ్డి దామోదర్ రెడ్డి,జిల్లా నేతలు గాదె పృథ్వీ గోళ్ల రాజేంద్రప్రసాద్,గడ్డం రాకేష్,డా.పద్మజదేవి,కరాటే ప్రభాకర్,మెరుగు శివకోటి, అమంచ సునీల్,నామాల సిద్దులు,రాజ్ కుమార్,ప్రశాంత్ రెడ్డి,బర్ల శివ,ముస్కు రమేష్,ప్రశాంత్, సనత్,ప్రసన్న కుమార్, చక్రపాణి, రవిష్, నగేష్ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్లు, నాయకులు,కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


