గంభీరావుపేటలోవిద్యుత్ సమస్యలపైరోడ్ ఎక్కిన రైతన్నలు
కామారెడ్డి -సిద్దిపేట రహదారిపై రెండు గంటల పాటు ధర్నా నిర్వహించిన రైతులు
గంభీరావుపేట : విద్యుత్ కోతలను నిరసిస్తూ గురువారం గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ స్థూపం వద్ద వివిధ గ్రామాలకు చెందిన రైతులు గురువారం ఆందోళనకు చేశారు. కాలిపోయిన మోటార్లను రోడ్డుపై వేసి ధర్నా రాస్తారోకో నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటలపాటు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ,కాంగ్రెస్ పాలనలో రైతులను కరెంటు కష్టాలు పడుతున్నామని పంట పొలాలు ఎండిపోతు న్నాయని విద్యుత్ మూడు గంటలు కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదని, లో వోల్టేజ్ కారణంగా మోటార్లు కాలిపోతున్నాయని, దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి రైతులకు సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను కోరారు. ధర్నా స్థలానికి మొదటగా ఎస్సై సిహెచ్ శ్రీకాంత్ పోలీస్ సిబ్బందితో ధర్నా స్థలానికి వచ్చి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పర్యవేక్షించారు. అనంతరం తహసిల్దార్ మారుతి రెడ్డి, ఏఈ ఆనంద్ కుమార్, చేరుకొని రైతులకు నచ్చజెప్పిన వినకుండా ధర్నా చేస్తూ ఉన్నారు. అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఇట్టి ధర్నా కార్యక్రమంలో సర్పంచ్లు మద్దుల రాజిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ , బాబు, పొన్నాల మహేష్ ,తోపాటు మాజీ సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్, రైతులు గడ్డమీద ప్రసాద్ రెడ్డి, గంట అశోక్, కోడె రమేష్, దోమకొండ కృష్ణ కాంత్ యాదవ్ ,మహేష్ రెడ్డి, చిలుక ప్రశాంత్, లింగ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, చిప్పల బాలయ్య, చిలుక స్వామి, దామోదర్ రెడ్డి, రాజిరెడ్డి, సంజీవరెడ్డి, రాజు, తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


