వినాయక మండపం వద్ద లక్కీ డ్రాలో 10 కిలోల లడ్డూ కైవసం
- త్రినేత్ర యూత్ ఆధ్వర్యంలో నిర్వహణ.. సుమారు 150 మంది పాల్గొన్న భక్తులు
- లక్కీ డ్రా విజేతగా చౌటకూర్ ప్యాట గంగారం
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో త్రినేత్ర యూత్ ఆధ్వర్యంలో వినాయక పండగ సందర్బంగా నిర్వహించిన వినాయక ప్రసాదం లక్కీ డ్రా కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ లక్కీ డ్రాలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 150 మంది భక్తులు పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. త్రినేత్ర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో విజేతగా చౌటకూర్ గ్రామానికి ప్యాట గంగారం వ్యక్తి నిలిచారు. ఆయనకు శాలువా తో సత్కరించి 10 కిలోల లడ్డూను అందజేశారు. త్రినేత్ర యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువతతో పాటు స్థానికులు ఆసక్తిగా హాజరయ్యారు. లక్కీ డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంతో పాల్గొన్న వారిలో ఉత్సాహం నెలకొంది. కార్యక్రమం సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ యువతను ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడమే తమ ఉద్దేశమని తెలిపారు.లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన ప్యాట గంగారం గ్రామానికి చెందిన వ్యక్తికి పలువురు అభినందనలు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడంతో త్రినేత్ర యూత్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


