పదవి విరమణ పొందిన పోలీస్
అధికారులను ఘనంగా సన్మానించిన ఎస్పీ.
భూపాలపల్లి : వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి – కుటుంబానికి సమయాన్ని కేటాయించాలి: జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్జ యశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ విభాగంలో సుదీర్ఘకాలం పాటు కర్తవ్యనిబద్ధతతో విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులను పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ రిటైర్డ్ అధికారులను అభినందించి, వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం అత్యంత బాధ్యతాయుతమైనదని, కుటుంబానికి దూరంగా ఉండి ప్రజల భద్రత కోసం అంకితభావంతో సేవలందించడం పోలీస్ సిబ్బంది గొప్పతన మని అన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిడులు, సవాళ్లు ఎదురైనా వాటిని సమర్థవంతంగా అధిగమించి సేవలందించిన రిటైర్డ్ అధికారుల సేవలు పోలీస్ శాఖకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతూ ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపాలని సూచించారు.
సన్మానం పొందిన అధికారులు:
- ఎండి. ఫజల్ ఉల్లా ఖాన్ – ఎస్సై, షీ టీం, భూపాలపల్లి జిల్లా.
- జే. సమ్మిరెడ్డి – ఏఎస్ఐ, ఘణపురం పోలీస్ స్టేషన్, భూపాలపల్లి జిల్లా.
- ఎస్.ఉపేందర్ – ఏఆర్‌ఎస్‌ఐ, భూపాలపల్లి హెడ్‌క్వార్టర్స్.
ఈ సందర్భంగా రిటైర్డ్ అధికారులకు వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి వారి విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, అడ్మిన్ ఆర్‌ఐ రత్నం,రిటైర్డ్ అధికారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు పోలీస్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
