యు - డైస్+ వివరాల 100% ధృవీకరణ తప్పనిసరి

జిల్లా విద్యాధికారి బి. వాసంతి

యు - డైస్+ వివరాల 100% ధృవీకరణ తప్పనిసరి

పి జి ఐ ర్యాంకింగ్ మెరుగుదలపై ప్రధానోపాధ్యాయులకు దిశానిర్దేశం

కొత్తగూడెం : ఆనందఖని ఉన్నత పాఠశాలలోని జిల్లా ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల సమావేశంలో జిల్లా విద్యాధికారి బి. వాసంతి పాల్గొని పాఠశాల విద్యా నాణ్యత సూచిక  ర్యాంకింగ్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ఏడాది జిల్లాకు వచ్చిన పిజిఐ ర్యాంకింగ్ ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నారు. ఈసారి ర్యాంకింగ్‌ను మెరుగుపరచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అన్ని మౌలిక సదుపాయాలు, విద్యా కార్యక్రమాలు, ఇతర వివరాలను యు– డైస్+ పోర్టల్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని ప్రతి పాఠశాలలో నమోదైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, 100 శాతం వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అన్ని విద్యా కార్యక్రమాలు సక్రమంగా నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే, విద్యార్థుల అభ్యాస నైపుణ్యాల పెంపు కోసం ఖాన్ అకాడమీకు సంబంధించిన కార్యకలాపాలను అన్ని పాఠశాలల్లో సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో సెక్టోరియల్ అధికారులు మాధవరావు, సతీష్ కుమార్, జానకి, జిల్లా సైన్స్ అధికారి బి. సంపత్ కుమార్ పాల్గొని ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న వివిధ విద్యా కార్యక్రమాలు, వాటి పురోగతిపై ప్రధానోపాధ్యాయులకు వివరించారు. 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి