పుల్కల్‌లో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

పుల్కల్‌లో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

చౌట్కార్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ ఆదిలక్ష్మి ముంగి మహారాజ్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి, పుల్కల్ గ్రామ సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డి కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి అభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయానికి విచ్చేసిన ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ భక్తులు, స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News