ఎర్రవల్లిలో వైభవంగా గణేష్ నవరాత్రోత్సవాలు

గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎన్.సి. సంతోష్

ఎర్రవల్లిలో వైభవంగా గణేష్ నవరాత్రోత్సవాలు

 

 

సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు (ఎర్రవల్లి గ్రామం)లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శనివారం రోజు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎన్.సి. సంతోష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపానికి విచ్చేసిన వారికి నిర్వాహకులు, యూత్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్.సి. సంతోష్ మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. వార్డులో ఆధ్యాత్మిక చింతనతో పాటు ఐక్యతను పెంపొందించేలా అంబేద్కర్ యూత్ సభ్యులు ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. యువత ఇలాంటి సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ గ్రామాభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు తోడ్పడాలన్నారు. గణేష్ నవరాత్రులను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరు

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News