రసవత్తరంగా మెదక్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్

రసవత్తరంగా మెదక్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్

మెదక్: మెదక్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ రెండో రోజు పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. మెదక్ బాయ్స్ హైస్కూల్‌లో అండర్-14 బాలబాలికలకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మెదక్ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన బాల బాలికల 21 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించగా, పోటీలు హోరాహోరీగా సాగాయి. రెండో రోజు కార్యక్రమానికి డీఎస్పీ ప్రసన్నకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించి, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ ఆర్. నాగరాజు, పేట టీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ మధు, టీజీ పేట ప్రెసిడెంట్ ఆర్. శ్రీధర్ రెడ్డి, సెక్రటరీ దాసరి మధు, మాధవరెడ్డి నరేష్ దేవేందర్ రెడ్డి అల్లి నరేష్ శిల్పా ప్రతిభ సుజాత రూపేందర్ శ్యామ్ తెలంగాణ మోడల్ స్కూల్ పిడి లు నర్సింలు బసవరాజ్ కేజీబీవీ కమల మల్లేశ్వరి శారద  తదితరులు పాల్గొన్నారు. క్రీడా పోటీల నిర్వహణకు నిర్వాహకులు, ఉపాధ్యాయులు సహకరించారు.

WhatsApp Image 2026-09-19 at 1.22.39 PM

Views: 125

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

14వ వార్డులో ఘనంగా బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు 14వ వార్డులో ఘనంగా బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు
  సిద్దిపేట జిల్లా/గజ్వేల్ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు భారత్ నగర్‌లో గరుడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు ఏర్పాటు
వీఐపీ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు 
తాడాన్‌పల్లిలో కుళ్లిపోయిన కోడిగుడ్ల పంపిణీ
లోధా కెసా పారడైజోలో భక్తి సందడి గణనాధునికి కోలన్ బాల్ రెడ్డి ప్రత్యేక పూజలు
పదవి బాధ్యత కి కష్టపడి పని చేయాలి 
 ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలి - CSFI డిమాండ్
గోండు గూడలో ఎస్పీ అఖిల్ మహాజన్ జనదర్బార్.