ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
మండల వ్యవసాయ అధికారి భాస్కర్
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామంలో మంగళవారం వ్యవసాయ అధికారి భాస్కర్ ఆధ్వర్యంలో రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ...సూపర్ ఎల్ నినో ప్రభావం వలన తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడుతాయన్నారు.గతం లో కంటే లోటు వర్షపాతం నమోదు అవుతుందని తెలిపారు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వలన వేసిన పంటలు కూడా భారీ గా దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు.రైతు సోదరులు అధిక నీటి వినియోగ పంటల సాగు కి బదులు గా ఆరు తడి పంటలు సాగు చేయాలన్నారు.జిల్లా యంత్రాంగం సబ్సిడీ పై కంది,పెసర,ఆముదం విత్తనాలు అందుబాటులో తీసుకొచ్చిందన్నారు.వివరాలకు క్లస్టర్ పరిధిలోని సంబంధిత ఏఈఓ లను సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ అంబాల సారమ్మ కొమురయ్య,ఏఈఓ మౌనిక,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Views: 12
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
