గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ - ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్

WhatsApp Image 2026-03-01 at 5.24.21 PM

 

మరిపెడ: గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ అని, బంజారా జాతి ఉనికి, మనుగడ, అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. ఆదివారం సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని  మరిపెడ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో సేవాలాల్ కమిటీ చైర్మెన్ గుగులోత్ రవి నాయక్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించి భోగ్ భండార్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత గిరిజనులంతా సేవాలాల్ చిత్రపటంతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్ బండార్, గిరిజన సంప్రదాయ నృత్యాలు, పలు పాఠశాల లకు చెందిన విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మత్తు పానియాలు, హింసకు దూరంగా ఉండాలని, గిరిజనులంతా ఐక్యమత్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరా రెడ్డి, మరిపెడ మునిసిపాలిటీ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ కాలం సునీతా రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు కొంపెళ్లి శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఇస్లావత్ సుధాకర్, వైస్ చైర్మెన్ ఐలమల్లు, జెడ్ పీ సీఈవో పురుషోత్తం, కౌన్సిలర్లు ఇస్లావత్ తిరుపతి, జాటోతు సురేష్, లూనావత్ రమేష్, పానుగోతు రాములు, మెరుగు రాము, కాంతమ్మ, నీలా లచ్చిరాం, గౌతమ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్, మరిపెడ నాయకులు కొంపెళ్లి సురేందర్ రెడ్డి, పానుగోత్ రాంలాల్, గంధసిరి అంబరీష, బుచ్చిరెడ్డి, బోర గంగయ్య, కాంగ్రెస్ నాయకులు, అధికారులు జడ్పీసీఈవో పురుషోత్తం, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో వేణుగోపాల్, ఆర్ఐ శరత్ చంద్ర, ఎంపీవో సోమ్లాల్, తదితరులు పాల్గొన్నారు.

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News