రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే
సుబాబుల్ పంట విషయమై ఎమ్మెల్యేను కలిసిన చీమలపాడు సర్పంచ్ మాలోత్ లలిత బావ్ సింగ్

కారేపల్లి : రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అధికారులను ఆదేశించాలని రైతులతో కలిసి తమ ఆవేదనను వైరా ఎమ్మెల్యేకు తమ గోడును తెలుపుకున్నారు.ఆదివారం చీమలపాడు సర్పంచ్ మాలోత్ లలిత బావ్ సింగ్,రైతులతో కలిసి వైరా ఎమ్మెల్యే తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అనుమతిని ఇప్పించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులను పిలిపించి సమస్య తెలుసుకొని కలెక్టర్ తో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారన్నారు.అలాగే సామరస్యంగా కాలువ పనులు అడ్డుకోకుండా రైతులు సహకరించాలని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బచ్చలి వెంకటేశ్వర్లు, మాలోత్ స్వామి,గుజ్జర్లపూడి సైదులు,పాటి రాంబాబు,పాటి రామయ్య, గుజ్జర్లపూడి జాను,పాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


