అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

WhatsApp Image 2026-03-01 at 3.26.28 PM

 

కారేపల్లి  : ఖమ్మం వెలుగుమట్ల పేద ప్రజల ఇండ్లను కూల్చడమేనా ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రజా పాలనా అని అఖిలపక్షాల నాయకులు నినందించారు. ఆదివారం కారేపల్లి మండల కేంద్రంలో అఖిలపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా పార్టీల జిల్లా నాయకులు కొండబోయిన నాగేశ్వరరావు,వై ప్రకాష్,కే.నరేంద్ర,జీతేజ నాయక్,సక్రు నాయక్ లు మాట్లాడుతూ..ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్ల గ్రామంలో గత పది సంవత్సరాల క్రితం ఎస్ టి ఎస్ సి బిసి మైనార్టీ వర్గాలకు చెందిన రెక్కాడితే డొక్కాడని అన్ని వర్గాలకు చెందిన పేద ప్రజలు కాయకష్టం చేసి లక్షలాది రూపాయలు అప్పులు చేసి భూములు అమ్ముకొని ఇండ్ల నిర్మాణం చేపడితే దాదాపు రెండువేల మంది పోలీసు బలగాలతో నైజాం రజాకార్లను మరిపించే విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు గాని నోటీసులు గాని ఇవ్వకుండా పూర్తిగా నేలమట్టం చేయడం అమానుశం ఉన్నారు.దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుతూఇండ్ల నిర్మాణం అయ్యేంతవరకు ప్రభుత్వమే వీరికి వసతి ఆహార  సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనియెడల బాధిత కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Views: 46

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News