నేడే స్వామివారి కల్యాణ మహోత్సవం

WhatsApp Image 2026-03-01 at 5.10.05 PM

 

కారేపల్లి  : కారేపల్లి గ్రామంలోని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరపబడుననీ ఆలయ ఈవో కే.వేణుగోపాలచార్యులు, జూనియర్ అసిస్టెంట్ మూడు మోహన్ లు తెలిపారు.ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ... నేడు సోమవారం ఉదయం 5:30 నిమిషాలకు సుప్రభాత సేవ,పంచామృతాలతో అభిషేకము, స్వామివారి అలంకరణ,స్వామి వారి సర్వదర్శనము,తీర్థ ప్రసాదాలు,అనంతరం తొమ్మిది గంటల 45 నిమిషాలకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుందన్నారు.అనంతరం మహా అన్నదాన కార్యక్రమం తదుపరి సాయంత్రం గ్రామ పురవీదుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించబడుతుందన్నారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.

Views: 60

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News