శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...

శంకరపట్నం : ఆర్.ఎం.పి ల అసోసియేషన్ మండల అధ్యక్షునిగా పెంట సాంబయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీల సంఘం సీనియర్ నాయకులు పలుకల రఘుపతి రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం. శంకరపట్నం మండలం ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా మొలంగూర్ గ్రామానికి చెందిన పెంట సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజాపూర్ గ్రామానికి చెందిన పెసరి వీరార్జున్, కోశాధికారిగా గుండేటి సమ్మయ్య, లతోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా మండల సమావేశంలో ఎన్నుకున్నట్లు రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా నియామకమైన పెంట సాంబయ్య మాట్లాడారు. మండల అధ్యక్షునిగా తన ఎన్నికకు కృషిచేసిన తోటి ఆర్.ఎం.పి ల సంక్షేమం కోసం సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చి నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సాంబయ్య కృతజ్ఞతలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


