ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణికి పునర్జన్మ. తల్లి, బిడ్డల, ప్రాణాలని సురక్షితంగా కాపాడిన మలక్ పేట్ యశోద డాక్టర్ల బృందం.
మలక్ పేట్ యశోద వైద్యుల అద్భుతం అరుదైన గుండె జబ్బు ఉన్న మహిళకు సురక్షిత ప్రసవం డాక్టర్ సత్యప్రియ సాహూ, డాక్టర్ ప్రియాన్షి.

కరీంనగర్ : జన్యుపరమైన గుండె జబ్బు, తీవ్రమైన పల్మనరీ హైపర్‌టెన్షన్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మహిళకు హైదరాబాద్ మలక్ పేట్ లోని యశోద హాస్పిటల్ వైద్యులు సురక్షితంగా జన్యుపరమైన సమస్యలతో ఉన్న మహిళలకు పురుడు పోశారు. కరీంనగర్ ఆనుహతి బ్యాంకేట్ హాల్ లో శనివారం మలక్ పేట్ యశోదా డాక్టర్ల బృందంతో శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. యశోద హాస్పిటల్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ సత్యప్రియ సాహూ,గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రియాన్షి , మలక్ పేట్ యశోద బ్రాంచ్ మేనేజ్మెంట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు...కరీంనగర్‌కు చెందిన 21 ఏళ్ల గర్భిణి తీవ్రమైన పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ (పీఏహెచ్), రైట్ వెంట్రిక్యులర్ డిస్ఫంక్షన్‌తో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు.గతంలో ఆమెకు వీఎస్‌డీ శస్త్రచికిత్స జరిగిన నేపథ్యం ఉండటంతో, గర్భధారణ సమయంలో కుడి గుండె వైఫల్యం చెంది ప్రాణాపాయం కలిగే ముప్పు పొంచిఉందన్నారు.తమ
వైద్య నిపుణుల బృందం అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి, 29 వారాల సమయంలోనే అత్యవసర సిజేరియన్ (ఎల్‌ఎస్‌సీఎస్) నిర్వహించినట్లు పేర్కొన్నారు.కేవలం 1.1 కిలోల బరువుతో జన్మించిన ఆడ శిశువుకు శ్వాసకోశ ఇబ్బందులు (ఆర్డీఎస్), సెప్సిస్ వంటి సమస్యలు తలెత్తాయి. వెంటనే చిన్నారిని అధునాతన ఎన్‌ఐసీయూలో ఉంచి 'ఇన్సూర్' పద్ధతిలో చికిత్స అందించామన్నారు.
శిశువు గుండెలో ఉన్న రంధ్రాన్ని (పీడీఏ) డివైస్ క్లోజర్ ద్వారా విజయవంతంగా మూసివేసినట్ లుతెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. తీవ్రమైన గుండె జబ్బు ఉన్న మహిళల్లో ప్రసవం అత్యంత క్లిష్టమైనదని, మల్టీడిసిప్లినరీ వైద్య బృంద సమన్వయంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. హై-రిస్క్ కేసులను ఎదుర్కోవడంలో యశోద ఆసుపత్రిలోని అత్యాధునిక వసతులు కీలక పాత్ర పోషించాయని వివరించారు. ఈ కేసు మలక్ పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మలక్‌పేట్‌లో హై-రిస్క్ కార్డియాక్ గర్భధారణలు మరియు అత్యంత ముందస్తు శిశువుల అత్యవసర పరిస్థితులను సమగ్ర వైద్య నైపుణ్యంతో నిర్వహించే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. సమయానికి రిస్క్ అంచనా, శాస్త్రీయ శస్త్ర ప్రణాళిక, సమగ్ర కార్డియాక్ పర్యవేక్షణ మరియు అధునాతన మద్దతు తల్లి మరియు శిశువు రక్షణలో కీలక పాత్ర పోషించాయని యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మలక్‌పేట్, హైదరాబాద్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె. శ్రీనివాస రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర తెలిపారు. యశోదా హాస్పిటల్స్ అన్ని శాఖల్లో హై-రిస్క్ ప్రసూతి, కార్డియాలజీ, సేవలు అందుబాటులో ఉన్నాయని, అత్యంత క్లిష్టమైన కేసులను సమగ్ర వైద్య సేవలతో విజయవంతంగా నిర్వహించే పూర్తి సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశం లో యూనిట్ హెడ్ కె. శ్రీనివాస రెడ్డి, ఏవీపీ శ్రీనివాస్ చిదుర తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


