నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం

ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసుకోవాలి : మర్పల్లి ఎస్సై అబ్దుల్ రావుప్

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం

మర్పల్లి,( వికారాబాద్): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయని మర్పల్లి ఎస్సై అబ్దుల్ రావుప్ అన్నారు. ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన  ఆరు కమ్యూనిటీ సీసీ కెమెరాలను సోమవారం సర్పంచ్ తో కలసి ఎస్సై అబ్దుల్ రావుప్ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.చిన్న గ్రామాల్లోనూ సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా గ్రామాల్లో జరిగే సంఘటనలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు భద్రతా భావం కల్పించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్సై పేర్కొన్నారు.అనంతరం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన సర్పంచ్‌ను ఎస్సై అబ్దుల్ రావుప్ సన్మానించారు. గ్రామస్తుల సహకారంతో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు.
 
 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ మోర్చా నియామకం పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ మోర్చా నియామకం
పాపన్నపేట ; పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ కిషన్ మోర్చా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి...
అన్యాక్రాంతమైన భూములను కాపాడండి.
చౌటకూర్ నుంచి పోసానిపల్లెలో గ్రామంలోని వెళ్తున్న రోడ్డు పక్కన ఉన్న చెట్లను యథేచ్ఛగా చెట్ల నరికివేత
పెండెల రవీందర్‌ను పరామర్శించిన చల్లా..
ఘనంగా ఆదివాసీ దినోత్సవం 
నూలస్వప్న గారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం 
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం