నిరుపేద కుటుంబం నుంచి జాతీయ స్థాయి అథ్లెట్‌గా కొడవత్ స్వప్న - స్వర్ణ పతకం కైవసం
నాగర్ కర్నూల్, : పేదరికాన్ని జయించి పట్టుదలతో జాతీయ స్థాయిలో సత్తా చాటింది నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరి గ్రామపంచాయతీ పరిధిలోని కొడవత్ తండాకు చెందిన కొడవత్ స్వప్న అథ్లెటిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచింది. పుదుచ్చేరిలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-20 బాలికల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేస్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి,ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయి అథ్లెట్‌గా ఎదిగిన స్వప్న ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. స్వప్న విజయంతో కొడవత్ తండాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు, క్రీడాభిమానులు ఆమెను అభినందిస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


