బతుకమ్మ ఉత్సవాలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి ఆహ్వానం
హన్మకొండలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వానించిన సాగరిక, రమాకాంత్ రెడ్డి
హన్మకొండ న్యూస్ : వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ని శుక్రవారం హన్మకొండలోని ఆయన కార్యాలయంలో నేషనల్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సాగరిక రమాకాంత్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిసి బతుకమ్మ, రావణ వధ ఉత్సవాలకు ఆహ్వానించారు.కాజీపేటలోని వడ్డేపల్లి ట్యాంక్ బండ్ వేదికగా నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి ఆహ్వాన పత్రిక అందజేసి కోరారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


