భగత్ సింగ్ నగర్‌లో పాత కక్షలతో వ్యక్తిగత ఘర్షణ.. కేసు నమోదు, పోలీసుల అదుపులో నిందితులు 

*సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవు ,జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది – డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి,

భగత్ సింగ్ నగర్‌లో పాత కక్షలతో వ్యక్తిగత ఘర్షణ.. కేసు నమోదు, పోలీసుల అదుపులో నిందితులు 

ఆదిలాబాద్ బ్యూరో అక్టోబర్ 16 (విజన్ ఆంధ్ర)ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్‌లో గత రాత్రి ఇద్దరు వ్యక్తుల మధ్య పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిగత ఘర్షణ చోటుచేసుకుందని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు. ఒక స్వామి మాల్ ఉన్న వ్యక్తి మరొక వ్యక్తితో దురుసుగా మాట్లాడటంతో ప్రారంభమైన గొడవ, అనంతరం దాడికి దారితీసిందని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయని వెల్లడించారు. ఈ ఘటనలో మొదట స్వామి దాడికి పాల్పడడం జరిగిందని, స్వామి పై దాడి ఘటనలో ఇద్దరు హిందువులు ఒక ముస్లిం మతాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని, స్వామి మాలలో ఉన్న వ్యక్తిపై ఇరు మతాలకు చెందిన వ్యక్తులు ఉన్నప్పటికీ, ఇది పాత కక్షలతో జరిగిన వ్యక్తిగత ఘర్షణ, కాలనీ వాసుల మధ్య మాత్రమేనని స్పష్టం చేశారు.ఈ ఘటనపై స్వామి ఫిర్యాదు మేరకు మావల పోలీస్ స్టేషన్‌లో హిందువులు, ముస్లింలపై కేసు నమోదు చేసి, గొడవకు కారణమైన నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.ఈ ఘటనను ఆసరాగా చేసుకొని సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వాస్తవాలు తెలుసుకోకుండా ఒక వర్గానికి మద్దతుగా ప్రచారాలు చేయడం, ఇతరులను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం, మతసామరస్యానికి భంగం కలిగించే ప్రయత్నాలు చేయడం, శాంతి భద్రతల సమస్యలు తలెత్తేల ప్రవర్తించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించినా, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా అసత్య ప్రచారాలు చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మవద్దని, వాస్తవాలు నిర్ధారించుకోకుండా ఎలాంటి ప్రచారాలు చేయవద్దని, ఆదిలాబాద్ జిల్లాలో మతసామరస్యాన్ని కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News