దుర్గామాత నవరాత్రి ఉత్సవా కమిటీ ఆహ్వానం మేరకు అమ్మవారి దర్శనం చేసుకున్న రవి:

బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి

దుర్గామాత నవరాత్రి ఉత్సవా కమిటీ ఆహ్వానం మేరకు అమ్మవారి దర్శనం చేసుకున్న రవి:

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా;కూకట్ పల్లి నియోజకవర్గం కైతలాపూర్ డివిజన్ ఆంజనేయులు నగర్ కాలనీ వద్ద దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన  ఈ సందర్భంగా నాయకులు రవి మాట్లాడుతూ, దుర్గామాత అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు, సంతోషాలు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News