వేరుశెనగ పంటలో చీడపీడల నివారణపై రైతులకు అవగాహన - బిజినేపల్లి ఏవో ప్రసాద్ బాబు
బిజినేపల్లి (నాగర్ కర్నూల్):నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వేరుశెనగ పంట సాగు చేస్తున్న రైతులకు మండల వ్యవసాయాధికారి (ఏవో) ప్రసాద్ బాబు చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం వేరుశెనగ పంటలో ఆశించే పేనుబంక, ఆకుముడత, తామర పురుగు, వేరుకుళ్లు వంటి చీడపీడల నుండి పంటను ఎలా రక్షించుకోవాలో రైతులకు క్షేత్రస్థాయిలో వివరించారు. రైతులు తీసుకొచ్చిన వేరుశెనగ మొక్కలను పరిశీలించి, తీసుకోవాల్సిన నివారణ చర్యలు, పిచికారీ చేయాల్సిన మందుల గురించి తెలియజేశారు. రైతులు అధిక దిగుబడి సాధించేందుకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, నాణ్యమైన విత్తనాలు, సమయానుకూలంగా ఎరువులు వాడాలని సూచించారు. పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు రైతులు పాల్గొని తమ పంటలకు సంబంధించిన సందేహాలను ఏవోను అడిగి తెలుసుకున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


