పట్టభద్రుల ఓటు నమోదులో అశ్రద్ధ వద్దు-పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి.
నల్లగొండ : పట్టభద్రుల ఎన్నికల ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా నగరంలోని1నుంచి 25 వార్డుల వరకు ముఖ్య నాయకులు,కార్పొరేటర్లు, కాంటెస్ట్ కార్పొరేటర్లు, పట్టభద్రుల ఓటు నమోదు ఎన్రోలర్లతో జరిగిన సమావేశంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిలు పాల్గొని ఇప్పటివరకు జరిగిన ఎన్నికల నమోదు కార్యక్రమాన్ని సమీక్షించారు.ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూఎన్రోలర్లు, కార్పొరేటర్లు,కాంటెస్టెడ్ కార్పొరేటర్లు,ముఖ్య నాయకులు నగరంలోని ఎవరికి వారు సంబంధించిన డివిజన్లలో ఇంటింటికి తిరిగి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేయాలని,ఒకవేళ ఇప్పటికే ఓటర్ నమోదు చేయించుకున్న వారి వివరాలు తీసుకొని నమోదు చేసుకోవాలని కోరారు.
ముఖ్యంగా నల్లగొండలోని వివిధ డివిజన్లలోని కాలనీలలో ప్రతి ఇంటికి తిరిగి ఉద్యోగస్తులను,గ్రాడ్యుయేట్లను గ్రాడ్యుయేట్ ఓటర్ గా నమోదు చేయించాలని,ఈ విషయంలో ఎవరు కూడా అశ్రద్ధ చేయవద్దని,ప్రతి ఒక్కరు కూడా నమోదు కార్యక్రమంలో భాగస్వాములై పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు.ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తాను ఓటర్ నమోదు కొరకు ఉమ్మడి వరంగల్,ఖమ్మం,నల్గొండ జిల్లాలు తిరుగుతున్నానని, ఎక్కడికి పోయినా మంచి రెస్పాన్స్ వస్తున్నదని,ఇది పార్టీ భవిష్యత్తు గెలుపుకు బాట వేస్తుందని అన్నారు.గతంలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయకపోవడం వల్ల మనం ఓడిపోయామని,కానీ ఈసారి అలా జరగడానికి వీలు లేదని,మూడు జిల్లాల్లోని మొత్తం 36 నియోజకవర్గాల్లో 34 చోట్ల కాంగ్రెస్ వారి మిత్రపక్షం అధికారంలో ఉందని,వారి అధికారాన్ని, డబ్బులను అడ్డుకొని మనం ఎన్నికల్లో గెలిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో మనకు తిరుగుండదని,కాబట్టి ప్రతి ఒక్కరు ఓటర్ నమోదుకు కృషి చేయాలని కోరారు.ఈ సమావేశంలోకార్పొరేటర్లు మారగోని భవాని గణేష్,పెరిక యాదయ్య,పేర్ల మల్లీశ్వరి అశోక్,రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్,కుందూరు దీపికా ప్రవీణ్ రెడ్డి,బాణావత్ దీప్లా, దొడ్డి రమేష్, గోపగోని స్వాతి రాజశేఖర్,ముఖ్య నాయకులు పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, సయ్యద్ జాఫర్,చింతల యాదగిరి,బొజ్జ వెంకటయ్య, గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి, దండంపెల్లి సత్తయ్య, పొనుగోటి జనార్దన్ రావు, భాషపాక హరికృష్ణ,మాతంగి అమర్,పున్న వెంకన్న,వజ్జ శ్రీనివాస్,అఫ్జల్ ఖాన్, శంషుద్దీన్, పెద్దులు,నరేష్, కోట్ల అశోక్ రెడ్డి,షాగటి వెంకన్న,ఆయా డివిజన్లకు చెందిన ఎన్ రోలర్లు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


