గుడాటిపల్లి నిర్వాసితుల కేసులో ఎన్జీటీకి పర్యావరణ శాఖ నివేదిక
తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ నివేదిక పరిశీలన అనంతరం తదుపరి వాయిదాలో వాదనలు
అక్కన్నపేట : గౌరవెల్లి ప్రాజెక్టు కారణంగా గుడాటిపల్లి నిర్వాసితులకు సంబంధించిన అంశంపై చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన OA No.56/2023 కేసులో ఈరోజు వాదనలు జరిగాయి. గుడాటిపల్లి నిర్వాసితులు బద్దం భాస్కర్ రెడ్డి, కొత్త సంజీవరెడ్డి, ఉస్కె సురేందర్ రెడ్డి దాఖలు చేసిన ఈ కేసులో పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను ట్రిబ్యునల్కు సమర్పించారు. ఈ విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదికలోని అంశాలను పరిశీలించిన అనంతరం తదుపరి వాయిదాలో కేసుకు సంబంధించిన వాదనలు కొనసాగనున్నాయి. నివేదికలోని వివరాలు, వాటిపై ట్రిబ్యునల్ పరిశీలన అనంతరం కేసులో తదుపరి పరిణామాలు వెల్లడికానున్నాయి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


