ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి నీ ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా 

అభివృద్ధి పనుల్లో నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు: జిల్లా కలెక్టర్ రాజర్షిషా

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి నీ ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్ : రిమ్స్ ఆసుపత్రిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, రోడ్లు, భవనాల నిర్మాణాలు, మరమ్మతులు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. గురువారం రిమ్స్ ఆసుపత్రితో కొనసాగుతున్న అభివృద్ధి పనులను, కొత్తబ్లాక్ నిర్మాణాలను, మరమ్మత్తు పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో రిమ్స్ డైరెక్టర్ చాంబర్లో అధికారులతో సమీక్షించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టెండర్లలో బిడ్లు తక్కువకు వేసినప్పటికీ పనుల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని తేల్చిచెప్పారు. ఎంబీఎస్ గైడ్‌లైన్స్ ప్రకారం కన్సల్టెంట్ ఇంజనీర్లు పర్యవేక్షించి, నిర్దేశిత 13-14 శాతం ప్రాఫిట్ మినహాయించి నాణ్యమైన పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఒకవేళ ఎక్కడైనా లోపాలు లేదా గ్యాప్స్ ఉంటే, వాటిని వెంటనే గుర్తించి మరింత పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను అప్రమత్తం చేశారు. కొత్తబ్లాక్, ఆసుపత్రి పరిసరాల్లో పారిశుద్ధ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అటెండెండ్లు, రోగుల సౌకర్యార్థం వాషింగ్ ఏరియాలు, డస్ట్ బిన్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. డస్ట్ బిన్లు, వాషింగ్ బేసిన్లు సక్రమంగా వాడకపోతే లేదా పరిశుభ్రత లోపిస్తే సంబంధిత ఏజెన్సీలకు, సెక్యూరిటీ గార్డులకు తక్షణమే జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బుక్స్ ప్రింట్ అయ్యాయని, త్వరలో క్షేత్రస్థాయిలో జరిమానాల అమలు ప్రారంభమవుతుందని తెలిపారు.ఎసిఎల్‌బి, నావిగేషన్, ఇతర అధికారుల బృందాలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలిస్తూనే ఉంటాయని, లోపాలుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కొత్తబ్లాక్ ప్రాంతంలో ఇప్పటికే ఎంఎన్‌ఐసీయూ సేవలు ప్రారంభించామని, ఈ బ్లాక్‌కు సంబంధించి శానిటేషన్ అన్ని రకాలుగా మెరుగ్గా ఉండాలని సూచించారు. త్వరలోనే దీనిపై మరోసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి తదుపరి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని, పనుల్లో నాణ్యతను పరిశీలించేందుకు అధికారులు నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని ఆయన పునరుద్ఘాటించారు.
అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భూ కొలతల సర్వే శాఖలో సర్వేయర్ గా పని చేస్తున్న  గోవింద్ ను కలెక్టర్ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ తనిఖీలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, వివిధ విభాగాల వైద్యులు, రోడ్లు భవనల శాఖ ఈఈ రమేష్, పంచాయతీ రాజ్, మున్సిపల్, జి.ఎం.ఎస్.సి.డి ల ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News