ప్రగతినగర్ దుర్గామాతను దర్శించుకున్న రాష్ట్ర, జిల్లా ఓబీసీ మోర్చా నాయకులు
కూకట్పల్లి : ప్రగతినగర్లో కొలువుదీరిన దుర్గామాతను రాష్ట్ర, జిల్లా ఓబీసీ మోర్చా నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి కోడిచెర్ల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవాల్లో నాయకులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు శేఖర్ యాదవ్, కూకట్పల్లి ఓబీసీ మోర్చా కన్వీనర్ వినోద్ కుమార్ గౌడ్, కైతలాపూర్ డివిజన్ అధ్యక్షుడు కందుకూరి తిరుపతిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు ఐలయ్య తదితరులు హాజరయ్యారు.వారితో పాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయి నాయకులు, ప్రతినిధులు, స్థానిక కాలనీవాసులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రగతినగర్లో భక్తి వాతావరణం నెలకొంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


