మున్సిపల్ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొన్నం సతీమణి పొన్నం మంజుల 

మున్సిపల్ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

 హుస్నాబాద్ : ద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి పొన్నం మంజుల హాజరయ్యారు.ఈ సందర్భంగా పట్టణ మహిళలు రంగురంగుల తీరక్క పూలతో తంగేడు బంతి చామంతి పూలతో బతుకమ్మలు చాలా అలంకరణగా పేర్చి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.అనంతరం మంత్రి పొన్నం సతీమణి పొన్నం మంజుల మాట్లాడుతూ తెలంగాణలో మహిళలందరూ ఎంతో సంతోషంగా చిన్న బతుకమ్మ రోజు నుండి సద్దుల బతుకమ్మ వరకు జరుపుకునే ఎంతో సంతోషంగా పండుగ తెలంగాణ మన సంస్కృతి వైభవానికి ప్రతిబింబమని తరతరాలుగా వస్తున్న ఈ పండుగ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గ మహిళలకు ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి వైస్ చైర్మన్ చిత్తారి పద్మ కౌన్సిలర్లు చేన్నవేణి లావణ్య, బూరుగు లత, కొండ రజిత,కాశవేణి సరిత, సావుల మంజుల,ఆకుల రజిత,వాల సుప్రజ,బత్తుల స్వరూప కో ఆప్షన్ సభ్యులు భూక్యా సరోజన,పున్న లావణ్య, ఖాతా గ్లోరీనా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిలేని అనితరెడ్డి, కాంగ్రెస్ నాయకులు వడ్డేపల్లి వెంకటరమణ చిత్తారి రవీందర్ ఎండి హసన్ మహిళా సంఘాల సిఏలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 58

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News