తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

కామారెడ్డి :బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించిన జనహిత గణేష్ మండలి, టీఎన్జీవో, టీజీవో సంఘాలు కామారెడ్డి జిల్లాలో జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో టీఎన్జీవో, టీజీవో సంఘాల సహకారంతో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి సంబరాలను ప్రారంభించారు. అనంతరం బతుకమ్మ పండుగ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉద్యోగులు, మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను చాటుతుందని తెలిపారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల విశిష్టతను భావితరాలకు తెలియజేసేలా పండుగలను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలందరూ ఐకమత్యంతో పండుగలను జరుపుకోవాలని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి, వాటిని భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్.వై. గిరి, టీఎన్జీవో కార్యదర్శి, టీజీవో అధ్యక్షుడు దేవేందర్, టీజీవో కార్యదర్శి సాయిరెడ్డి, జనహిత గణేష్ మండలి ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News