ఉమ్మడి పాలమూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలి ,అక్టోబర్ 17న కల్వకుర్తి ఉద్యమానికి తరలిరావాలి: అచ్చంపేట టీజేఏసీ పిలుపు
అచ్చంపేట : ఉమ్మడి పాలమూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, కరువు నివారణ చర్యలు తక్షణమే చేపట్టాలని అచ్చంపేట జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ.ఈ సందర్భంగా జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ వద్ద సాగునీటి కోసం ధర్నా చేస్తున్న రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయాలి,పాలమూరు జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. డిండి ప్రాజెక్టు పేరుతో జల దోపిడి జరిగితే పాలమూరు జిల్లాకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ నెల 17న కల్వకుర్తి పట్టణంలోని తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయం వద్ద ఉమ్మడి మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్ట్ జలసాధన జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యమానికి అచ్చంపేట ప్రాంత ప్రజలు, రైతులు, ప్రజాసంఘాల నాయకులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని అచ్చంపేట జేఏసీ పిలుపునిచ్చింది. పాలమూరు రైతాంగ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


