శ్రీసరస్వతీ దేవీగా భక్తులకు దర్శనమిచ్చిన ఏడుపాయల వనదుర్గామాత
పాపన్నపేట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలలో ఆరవ రోజైన శుక్రవారం రోజు దేవీ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని నవరాత్రుల ప్రత్యేక పూజారులు శ్రీ సరస్వతీ దేవి అవతారంలో(తెలుపు వర్ణంలో) అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారీ ఉత్సవ విగ్రహాన్ని నవరాత్రుల ప్రత్యేక పూజారులు అత్యంత సుందరంగా ముస్తాబు చేసి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.నవరాత్రుల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర,హైద్రాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక మంటపంలో ఏర్పాటు చేసిన అమ్మవారినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ప్రత్యేక పూజారులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి,సాయిబాబా,నరేష్, మహేష్,యాదగిరి,దీపక్ రెడ్డి,బలరాం తదితరులు పాల్గొన్నారు.నవరాత్రుల సందర్భంగా ఏడుపాయల్లో నవ రాత్రుల సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం కల్పించారు.ఏడుపాయల్లోభక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాపన్నపేట ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


