గ్లాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ కాలేజీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
శివంపేట : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని శివంపేట మండలంలోని కొత్తపేట గ్రామ పరిధిలోని గ్లాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్కాలేజీలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ , అధ్యాపకులు, విద్యార్థినులు, సంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి వేడుకల్లో పాల్గొన్నారు.బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేస్తూ పండుగ ఉత్సాహాన్ని చాటుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేయడంతో పాటు, పండుగల ద్వారా ఐక్యతాభావం పెంపొందుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. కళాశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


